వికారాబాద్, ముద్ర విలేకరి : పర్యావరణం, టెక్నాలజీలపై ఆమె చేస్తున్న విశిష్ట పరిశోధనలకు గాను ఆలంపల్లి ఆడబిడ్డకు డాక్టరేట్ వరించింది.వికారాబాద్ జిల్లా పరిధిలోని వికారాబాద్ మునిసిపల్ ఆలంపల్లికి చెందిన గొర్రె కళ్యాణి హైదరాబాదులోని జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో పర్యావరణం, టెక్నాలజీ పై ఆమె గత కొంతకాలంగా విశిష్ట పరిశోధనలు చేస్తూ పీహెచ్డీ పూర్తి చేసింది. ఆమె చేస్తున్న పరిశోధనలకు గాను కళాశాలలో జరిగిన స్నాతకోత్సవంలో ఆమెకు కళాశాల వైస్ ఛాన్సలర్ డాక్టర్ కిషన్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా కళాశాల అధ్యాపకుల బృందం డాక్టరేట్ ను అందజేసింది. డాక్టరేట్ రావడం నాకు ఎంతో సంతోషంగా ఉందని దీంతో నాపై మరింత బాధ్యత పెరిగిందని ఆమె తెలిపారు.