Take a fresh look at your lifestyle.

KTR మంత్రాంగం జీవన్ కోసమేనా…?

 

ఏప్రిల్ 10న బిఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా నాయకులతో కేటీఆర్ భేటీ..

BRS నాయకుల సమన్వయం సాధ్యమయ్యేనా…?

 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

మాజీమంత్రి జీవన్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరడం దాదాపుగా ఖాయమైంది. ఈనెల 10వ తేదీన జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ లో భారీ బహిరంగ సభ ద్వారా టిఆర్ఎస్ లో చేరనున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఇది ఇలా ఉంటే ఇటీవల BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో జగిత్యాల జిల్లాలోని ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఈ నేపద్యంలో జిల్లాBRS అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ జెడ్పీ చైర్మన్ వసంత సురేష్ లతో ktr తో సమావేశమై పాత, కొత్త కలుపుకొని పోవాలని, అండగా ఉంటానని సూచించినట్లు తెలిసింది. దీంతో ఈ సమావేశంకు ప్రాధాన్యత సంతరించుకుంది.

బిఆర్ఎస్ డైరెక్షన్ నే కారణమా..?

మాజీమంత్రి జీవన్ రెడ్డి తనను పట్టించుకోవడంలేదనే కారణం చూపి తనకున్న 40ఏళ్ల కాంగ్రెస్ అనుబంధానికి రాజీనామా చేశారు. అయితే BRS లో చేరేందుకు కమిట్మెంట్ తీసుకున్న తర్వాత, BRS డైరెక్షన్ లోనే సీఎం పై స్వరం పెంచినట్లు ప్రచారం జరుగుతుంది. సీఎం రేవంత్ ను గద్దె దించే వరకు ఊరుకునేది లేదంటూ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. అయినా కాంగ్రెస్ పెద్దలు జీవన్ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోలేదు. ఒకరిద్దరు మాత్రం జీవనకు కాంగ్రెస్ ఏం తక్కువ చేసిందని, అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు ఆరోపణ లు చేయడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఏప్రిల్ 10న కారు ఎక్కనున్న జీవన్ రెడ్డి..?

మాజీమంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్ 10న కారు పార్టీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు ఇటీవలే BRS నాయకురాలు తుల ఉమ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిసి మాట్లాడారు. జగిత్యాల శివారులో గాని, జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ లో గాని బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని, త్వరలోనే జీవన్ రెడ్డితో మాట్లాడేందుకు కేటీఆర్, హరీష్ రావులు జీవన్ రెడ్డి ఇంటికి వచ్చి సభా స్థలాన్ని పరిశీలించ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

ప్రత్యర్థులతో పనిచేయనున్న మాజీ మంత్రి...

రాజకీయాల్లో అసాధ్యం, సుసాధ్యమనేటివి ఉండవని రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట.  ఇప్పుడు ఇదే నిజం కానుందా? అంటే అవును అనే అర్ధం. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి BRS లో చేరనున్నారు. అయితే గతంలో BRS అధినేత కేసిఆర్, ఎమ్మెల్సీ రమణలతో ప్రత్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేయగా, ప్రస్తుతం వారితోనే కలిసి పని చేయాల్సిన పరిస్థితులు జీవన్ రెడ్డి కి ఎదురావుతున్నాయని విశ్లేషకుల అంచనా.

సమన్వయం సాధ్యమేనా…?

మాజీమంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరడం వల్ల పార్టీకి లాభం చేకూరుతుందా? లేక జీవన్ రెడ్డి వల్ల పార్టీలో తమ అవకాశాలు,  ప్రాధాన్యతలు తగ్గుతాయనే అపోహలతో నాయకుల మధ్య నడుస్తుందా వేచి చూడాల్సి ఉంది. వీరందరి మధ్య సమన్వయం సాధ్యమయ్యే పనేనా అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే జగిత్యాల ఎమ్మెల్యే రేసులో ఎమ్మెల్సీ రమణ, మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ లు ఉన్నారు. అయితే జీవన్ రెడ్డి రాకతో వీరి ఆశలు గల్లంతయినట్లేననే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.