ముద్ర, కోరుట్ల;
రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ కే. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం రోజు కోరుట్ల పట్టణంలోని వాసవి కల్యాణ భవనంలో మూడు మండలాలకు చెందిన బిజెపి ముఖ్య కార్యకర్తలతో శాంతి సమావేశం మరియు అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గతంలో జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకొని, అలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండడంలో మరియు శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీస్ వారికి సహకరించాలని ఆయన సూచించారు. ఏదైనా సమస్య ఉన్నట్లయితే సంబంధిత పోలీస్ వారికి మాత్రమే ప్రత్యక్షంగా లేదా డైలీ హండ్రెడ్ ద్వారా లేదా ఫోన్ ద్వారా గాని తెలియజేసి పోలీసు వారికి సహకరించాలి. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని, దాని ద్వారా జరిగే పరిణామాల గురించి నష్టాల గురించి తెలియజేస్తూ వారికి తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎస్సై ఎం.చిరంజీవి, రామచంద్రం, మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి, బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.