Take a fresh look at your lifestyle.

కోదాడ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది

కోదాడ లో ప్రశాంత వాతావరణంలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

పోలింగ్ సరళిని పరిశీలించిన మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి

ముద్ర ప్రతినిధి , కోదాడ ….

కోదాడ మున్సిపాలిటీకి బుధవారం జరిగిన ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగాయి . ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఊపందుకుంది . ఓటర్లకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఎమ్మెల్యే పద్మావతి , మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ లు పలు వార్డులలో పోలింగ్ సరళి పరిశీలించారు . మధ్యాహ్నం మంత్రి ఉత్తమ్ కోదాడ చేరుకుని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం అనంతరం ఓటింగ్ జరుగుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు . రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు . పోలింగ్ జరిగిన 32 వార్డులలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ సిఐ శివశంకర్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్త్ నిర్వహించారు . ఇక సాయంత్రం 5 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీలలో కలిపి 79.90 శాతం ఓట్లు పోలయ్యాయని అధికారులు తెలిపారు . హుజూర్నగర్ మున్సిపాలిటీలో 82.88 శాతం , కోదాడ మున్సిపాలిటీ లో 77.05 శాతం , నేరేడుచర్ల మున్సిపాలిటీలో 79.24 శాతం , సూర్యాపేట మున్సిపాలిటీ లో 79.38 శాతం , తుంగతుర్తి మున్సిపాలిటీ లో 88.36 శాతం ఓట్లు పోలయ్యాయి . కోదాడ మున్సిపాలిటీలో మొత్తం 53056 ఓట్లకు 40881 ఓట్లు పోలవ్వగా ఇందులో పురుషుల ఓట్లు 19568 , మహిళా ఓట్లు 19568 , ట్రాన్స్ జెండర్ ఓట్లు 7 పోలయ్యాయని అధికారులు తెలిపారు .

Leave A Reply

Your email address will not be published.