Take a fresh look at your lifestyle.

జిల్లాలో ఎల్పిజి గ్యాస్ కొరత లేదు : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
జిల్లాలో ఎల్పిజి గ్యాస్ కొరత లేదని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో ఎల్.పి.జి. గ్యాస్ కొరత లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ సూచించారు.జిల్లాలో గృహ వినియోగానికి అవసరమైన ఎల్.పి.జి. గ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని, గ్యాస్ ఏజెన్సీల ద్వారా సిలిండర్ల సరఫరా నిరంతరంగా జరుగుతోందని తెలిపారు. ఎక్కడైనా సిలిండర్ల కొరత ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
అవసరమైనంత గ్యాస్ నిల్వలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని, ప్రజలు అనవసరంగా ఎక్కువ సిలిండర్లు బుక్ చేసుకోవడం లేదా నిల్వ చేసుకోవడం చేయవద్దని కోరారు.

Leave A Reply

Your email address will not be published.