- పిఎసిఎస్ చైర్మన్ రాజీనామా చేయాలి – ఎరుకల వెంకటేష్ గౌడ్
తుర్కపల్లి,ముద్ర :తుర్కపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పై అధికారులు చర్యలు తీసుకోవాలని తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యను విమర్శించే స్థాయి మాజీ ఎమ్మెల్యే ది కాదని అన్నారు.
దావుస్ పర్యటనకు వెళ్లి రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెచ్చిన రేవంత్ రెడ్డిని, సంవత్సర కాలంలోని ఆలేరును అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను విమర్శించడం సరి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగిల్ విండో ఆఫీస్ కార్యాలయంలో రైతులతో ఎన్నికైన చైర్మన్ సీట్లో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత కూర్చొని సమావేశం నిర్వహించడం పై ఉన్నత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. పిఎసిఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.