Take a fresh look at your lifestyle.

గ్రామసభల్లో పథకాల పురోగతి ప్రజలకు తెలపాలి- జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

మహాదేవపూర్, ముద్ర:

గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వ పథకాల పురోగతిని ప్రజలకు వివరించాలని, అన్ని పథకాల లబ్ధిదారుల వివరాలను వివరించారని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను కోరారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సభల నిర్వహణకు ముందస్తుగానే షెడ్యూల్ తయారు చేసి పంచాయతి కార్యదర్శులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. నిర్దేశించిన ప్రాంతంలో గ్రామసభల నిర్వహణతో పాటు గ్రామంలో ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన లబ్ధిదారుల జాభితా చదివి పినిపించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,
అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డిఓ హరికృష్ణ, పంచాయతీ అధికారి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.