సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓపెన్ డే నిర్వహించారు వివిధ సైన్స్ ల్యాబ్ పరికరాలను వాటి పనితీరును ప్రదర్శించారు. సిద్దిపేట పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో సందర్శించి వాటి ప్రాధాన్యాన్ని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వ్యాసరచన, క్విజ్, పోస్టర్ ప్రదర్శనలు ఏర్పాటు చేసి గెలుపొందిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి సునీత అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ పి అయోధ్య రెడ్డి, ఐ క్యూ ఏ సి కోఆర్డినేటర్ డా.సి హెచ్ మధుసూదన్,డా శ్రీధర్,డా రాణి,డా పవన్ కుమార్,సి ఓ ఇ డా గోపాల సుదర్శనం తో పాటు అధ్యాపాకులు, విద్యార్థులు పాల్గొన్నారు.