Take a fresh look at your lifestyle.

ర‌హ‌దారి ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించిన హైడ్రా

 
ఊపిరి పీల్చుకున్న‌శ‌బ‌రి హిల్స్ లే ఔట్ య‌జ‌మానులు

హైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 29:

రంగ‌రెడ్డి జిల్లా అబ్దుల్‌పూర్‌మెట్ మండ‌లం పెద్దంబ‌ర్‌పేట విలేజ్‌లో ఓ లే ఔట్‌లోకి చొర‌బ‌డి ర‌హ‌దారుల‌ను ఆక్ర‌మించేసి నిర్మించిన ప్ర‌హ‌రీని హైడ్రా గురువారం తొల‌గించింది. 265 స‌ర్వే నంబ‌రులో 278 ప్లాట్ల‌తో శ‌బ‌రిహిల్స్ పేరిట లే ఐట్ వేశారు. ఈ లే ఔట్‌కు ఆనుకుని 346 స‌ర్వే నంబ‌రులో ఎక‌రం భూమి కొన్న వ్య‌క్తి లే ఔట్‌లోకి జ‌రిగి 20 ప్లాట్ల మేర ఆక్ర‌మించారు. త‌న స్థ‌లంలోంచి నాలా వెళ్తోంద‌ని చెబుతూ.. ఈ స్థ‌లం త‌న‌దంటూ ఆక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఆక్ర‌మ‌ణ‌తో త‌మ ప్లాట్ల‌తో పాటు.. లే ఔట్‌లోకి వెళ్లే దారి కూడా బంద్ అయ్యింద‌ని శ‌బ‌రి హిల్స్ లేఔట్ ప్లాట్ల య‌జ‌మానులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేర‌కు హైడ్రా విచార‌ణ చేప‌ట్టింది. ఇరుప‌క్షాల స‌మ‌క్షంలో ఏడీ స‌ర్వేతో హ‌ద్దుల‌ను నిర్ధారించింది. లే ఔట్‌లోకి 4 వేల గ‌జాల వవ‌ర‌కూ జ‌రిగిన‌ట్టు నిర్ధారించుకుని.. అందులోని ర‌హ‌దారుల‌కు ఆటంకంగా ఉన్న ప్ర‌హ‌రీల‌ను హైడ్రా గురువారం తొల‌గించింది. దీంతో శ‌బ‌రిహిల్స్ లే ఔట్ నివాసితులు ఊపిరి పీల్చుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.