Take a fresh look at your lifestyle.

14 సంవత్సరాలు నిండిన బాలికలకు ఉచితంగా హెచ్ పి వి వ్యాక్సిన్ . కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించిన మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత

 

ముద్ర, తాండూర్:

బాలికల బంగారు భవిష్యత్తు కోసం 14 సంవత్సరాలు నిండిన బాలికలకు కేంద్ర ప్రభుత్వంఉచితంగా హెచ్ పి.వి వ్యాక్సిన్ అందజేయడం అభినందనీయమని తాండూర్ పట్టణ మాజీ బిజెపి కౌన్సిలర్ సాహు శ్రీలత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నివారణకు హెచ్ పి వి వ్యాక్సిన్ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయడం చాలా గొప్ప విషయమని ఆమె పేర్కొన్నారు. కావున 14 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయి తప్పకుండా హెచ్ పి వి వ్యాక్సిన్ వేయించుకోవాలని ఇట్టి వ్యాక్సిన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆశ వర్కర్లను సంప్రదించి వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమె కోరారు. మహిళల పట్ల, బాలికల పట్ల అధిక ప్రాధాన్యతనిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.