Take a fresh look at your lifestyle.

ఘనంగా అష్టోతర శతఘటాభిషేకం.. ముగిసిన బ్రహ్మోత్సవాలు

 

 ముద్ర, భువనగిరి జిల్లా ప్రతినిధి :

 

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో శనివారం నిత్యారాధనల అనంతరం ఉదయం శ్రీ స్వామివారికి “అష్టోతర శతఘటాభిషేకము” ను శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానుసారముగా ఆలయప్రధానార్చకులు, ఉపప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, వేద పండితులు, అర్చక బృందం, పారాయణీకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో దేవాదాయ ధర్మాదాయ శాఖ డైరెక్టరు ఎమ్.హనుమంతరావు, కార్యనిర్వహణాధికారి జె. భవాని శంకర్, ఆలయ అనువంశికధర్మకర్త బి.నరసింహామూర్తి, ఉప కార్యనిర్వహణాధికారి, సహాయకార్యనిర్వహణాధికారులు పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు.

అష్టోత్తర శతఘటాభిషేకము ప్రత్యేకత

శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవముల సమగ్ర ఫలితాన్ని లోకములకు అందించే విలక్షణమైన ఆగమ శాస్త్ర ప్రసిద్ధమైన వేడుక. ఈ “అష్టోత్తర శతఘటాభిషేకం”. ఈ ఉత్సవ ప్రత్యేకతలు తెలియజేస్తూ 108 కలశములు భగవంతుని సృష్టిలోని 108 తత్త్వములకు ప్రతీకలు.సంవత్సరములు,అయనములు, పక్షములు, మాసములు, తిథులు, వారములు, నక్షత్రములను గణించిన 108 తత్త్వము భోధపడును. అనగా భగవంతుని సమగ్ర ఆరాధనా విధానము ఈ వేడుకలో దర్శించవచ్చును. పంచామృతములు, పవిత్ర నదీ నదములు
గర్భాలుంలోనే ^ స్వామి వారి తీర్ధములు, ఫల/రసాదులు
ఎరసాదులు మొదలగు సుగంధద్రవ్య ఫలములచే అభిమంత్రింపబడిన పవిత్ర తీర్ల రాజములతో !. శ్రీ స్వామివారి అమ్మవారి మూలవరులను ఉత్సవమూర్తులను అభిషేకించుట విశేషమై ఉన్నది. పంచామృత అభిషేక ఫలములను వివరిస్తూ లోకంలోని పంచభూతములు మధువంతములై మాధుర్య సుదలను (అమృత ధారలను) వరించి లోకములను సుబిక్షంగా ఉంచగలవని ఆయా అభిషేక మంత్రముల అర్ధ విశేషము.

సాయంకాలం శృంగార డోలోత్సవము

శనివారం సాయంకాలము శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనలు అనంతరము రాత్రి శ్రీ స్వామివారికి శృంగార డోలోత్సవమున ఆలయ ప్రధానార్చకులు, ఉపప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, వేదపండితులు, పారాయణికులు, అర్చక బృందం, అత్యంత వైభవంగా నిర్వహించెదరు. అనంతరము పండిత సన్మానము, ఉత్సవ పరిసమాప్తి గావింపబడును. ఈ వేడుకలో ఆలయ అధికారులు ఉద్యోగ సిబ్బంది భక్తులు పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకొనెదరు.

శృంగార డోలోత్సవము ప్రత్యేకత

డోలము అనగా ఊయల అని అర్ధము. శ్రీ స్వామివారికి అమ్మవారికి వివిధ నామ సంకీర్తనలతో శృంగార డోలోత్సవ వేడుక నిర్వహించుట ఎంతో విశేషమై ఉన్నది. మంచస్థం మధుసూదనం అనే శ్రుతి వాక్యము. డోలారూహులైన స్వామివారిని అమ్మవారిని దర్శించిన భగవత్ అనుగ్రహముచే మనోరథములు నెరవేరునని పురాణాలలో తెలియ బడుచున్నది. “శృంగారసుందరకిరీటలసద్వరాంగ” అని ఆదిశంకరులు శ్రీ స్వామివారిని స్తుతించుట ఈ శృంగార డోలోత్సవము లోని అంతరార్ధము.

సాంస్కృతిక కార్యక్రమాలు
శృంగార డోలోత్సవంలో భాగంగా రాత్రి: 9-00 గంటల నుండి ప్రధానాలయంలో డి. లక్షణాదేవి బృందం వారిచే భక్తి సంగీత కార్యక్రమము నిర్వహించారు.
ఉచిత వైద్య శిబిరం

శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 18-02-2026 నుండి శిబిరం కొండపైనప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించబడును. తేదీ: 28-02-2026 వరకు మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్ వారిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.