- సీఎం, మంత్రి, ఎమ్మెల్యేల చిత్రపటాలకు క్షీరాభిషేకం
ముద్ర ప్రతినిధి, గోదావరిఖని : ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో ఆమోదించినందుకు బుధవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్ ల చిత్రపటాల కు పాలాభిషేకం చేసి బాణాసంచా కాల్చి సీట్లు పంపిణీ చేశారు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ద్వారా దళితుల జీవితాల్లో చీకటి తొలగిన రోజు దళిత జీవితాల వర్గీకరణ ద్వారా వెలుగులు నింపిన వారు కృతజ్ఞతలు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మేయర్ బంగి అనిల్ కుమార్, మహంకాళి స్వామి,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.