Take a fresh look at your lifestyle.

గోదావరిఖనిలో రూ.26 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్

  • అభివృద్ధి పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: గోదావరిఖని పట్టణ చౌరస్తా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రూ.27 కోట్ల విలువైన షాపింగ్ కాంప్లెక్స్ అభివృద్ధి పనులను శనివారం సింగరేణి,మున్సిపల్ అధికారుల తో కలిసి రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పరిశీలించారు.ప్రాజెక్టు పురోగతిని వివరంగా అడిగి తెలుసుకున్నారు.పనుల నాణ్యత,నిర్మాణ వేగం,పారదర్శ కత పై ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరిఖని ప్రజలకు ఆధునిక వాణిజ్య సదుపాయాలు కల్పించడమే ఈ షాపింగ్ కాంప్లెక్స్ లక్ష్యం.ఇది ఒక వైపు నగర అభివృద్ధికి దోహదం చేస్తే, మరోవైపు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అన్నారు.ఇతర అభివృద్ధి పనులతో పాటు నగర ముఖచిత్రాన్ని మార్చనున్న దని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు అందించడమే ప్రభుత్వ ధ్యేయం. సింగరేణి,మున్సిపల్ అధికారుల తో సమన్వయం కలిగిన విధంగా ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ పర్యవేక్షన కార్యక్రమంలో సింగరేణి అధికారులు,మున్సిపల్ కమిషనర్,ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అధికారులు,సాంకేతిక నిపుణులు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పనుల ప్రగతిపై అధికారులు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు.ప్రజల్లో ఈ ప్రాజెక్టుపై మంచి ఆసక్తి నెలకొంది.ఇది పూర్తయిన తర్వాత గోదావరిఖని ప్రాంతం వ్యాపారాభి వృద్ధిలో ఒక ప్రధాన కేంద్రంగా మారుతుందనే నమ్మకం వ్యక్తం అవుతుందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.