Take a fresh look at your lifestyle.

సహజసిద్ద పద్ధతులతో చీడ, పీడల నివారణ….

 

ముద్ర నడిగూడెం…

సహజసిద్ద పద్ధతులతో చీడలను నివారించవచ్చని సిరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కిసాన్ సేవా రత్న డాక్టర్ మొలుగూరి గోపయ్య తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని వల్లాపురం లో సిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం పై నిర్వహించిన పొలం బడి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత రబీ సీజన్ లో వరి పంట ఎదిగే, పిలకలు వేసే దశలో ఉందని, పొలం ఆరోగ్యవంతంగా పెరగాలంటే నీటి ద్వారా నేలకు జీవామృతం పారించాలన్నారు. అలాగే పంటకు నష్టం చేసే కాండం తొలుచు పురుగు, ఆకు చుట్టు పురుగు, ఉల్లికోడు, తాటాకు తెగులు ఆశిస్తే నీమాస్త్రం లేదా వేప గింజల ద్రావణం లేదా తూటి కాడ ఆకు ద్రావణం పిచికారీ చేయాలన్నారు. అలాగే అగ్గి తెగులు, బాక్టీరియా ఆకు ఎండు తెగులు, ఆశిస్తే ఆవు మూత్రం పేడ ద్రావణం పిచికారీ చేయవచన్నారు. ఈ పద్ధతులు ప్రతి రైతు ఒక అర ఎకరంలో కుటుంబ ఆరోగ్య అవసరాల కోసం ప్రతి ప్రకృతి సాగు చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో పలువురు రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.