- భక్తులతో కిటకిటలాడిన గోదావరితీరం
మంథని,ముద్ర : మహాశివరాత్రి పర్వదినం సంధర్భంగా మంథని పట్టణంలోని శివాలయాలు బుధవారం భక్తులతో కిటకిటలాయి.పవిత్ర గోదావరినది తీరంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మొదట శ్రీ గౌతమేశ్వర స్వామిని దర్శించుకుని పట్టణంలోని శ్రీ ఓంకారేశ్వర స్వామి,శ్రీ భిక్షేశ్వర స్వామి,శ్రీ శీలేశ్వర-సిద్దేశ్వర స్వామి ఆలయాల్లో స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 5 గంటల నుండి భక్తుల సందర్శనతో ఆలయంలో పండుగ వాతావరణ నెలకొంది.మంథని గోదావరి తీరంలోని మధ్య భాగంలో ఒకే పాయ ప్రవహిస్తుండడంతో భక్తులు అక్కడి వరకు నడిచి వెళ్లి పుణ్య స్థానాలు ఆచరించారు.మంథని చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు భద్రతా చర్యలను చేపట్టారు.అలాగే శ్రీ సురాబాండేశ్వర స్వామి,శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు అభిషేకం చేసుకున్నారు.జూనియర్ కళాశాల వద్ద అనాదిగా కొలువుతీరిన రాజరాజేశ్వర స్వామి శివలింగం వద్ద,కొత్తగా వెలసిన భోయ లింగం వద్ద భక్తులు పూజ నిర్వహించారు.సాయంత్రం శివ పార్వతుల కళ్యాణ మహోత్సవానికి ఆలయాలను మామిడి తోరణాలతో అలంకరించి కళ్యాణ ఏర్పాట్లు చేశారు.
