Take a fresh look at your lifestyle.

​ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా: బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి :

ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన మాసం రంజాన్ అని, ఈ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవడం ఎంతో అభినందనీయమని టీపీసీసీ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు.
​సోమవారం భరత్ నగర్ కాలనీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన రంజాన్ కిట్లను ఆయన ముస్లింలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. గంగా-జమునా తహజీబ్ సంస్కృతికి ప్రతీకగా నిలిచే రంజాన్ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ కిట్లతో పాటు కాంగ్రెస్ నాయకుల సహకారంతో ఏర్పాటు చేసిన బియ్యం, పప్పులు వంటి నిత్యావసర సరుకులను కూడా ఆయన పేదలకు అందజేశారు.
​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఖలీల్, మహమ్మద్ షరీఫ్, బాకీ బాయ్, తూము సంతోష్ మరియు ఇతర కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.