మాదాపూర్, ముద్ర విలేఖరి: మసీద్ బండ కొండాపూర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో లింగంపల్లి డివిజన్ ప్రభారి రామరాజు, కంటెస్టెంట్ కార్పొరేటర్ కర్చర్ల ఎల్లేష్, నియోజకవర్గ కో కన్వీనర్ మణిభూషణ్, డివిజన్ అధ్యక్షులు భీమని కిషోర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో డివిజన్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. వికసిత్ భారత్ లక్ష్యం పై కార్యశాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని నియమితులైన వారందరికీ నియామక పత్రాలు అందజేత మరియు వికసిత్ భారత్ లక్ష్యం పై దిశానిర్దేశం చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రవికుమార్ మాట్లాడుతూ మన దేశంలో అధికారాన్ని చేపట్టి 11 ఏళ్ల సుపరిపాలన పూర్తైన నేపథ్యంలో ప్రతి బూత్ లోనీ కార్యకర్తలు పర్యటించి మన మోదీ గారి నేతృత్వంలో జరిగిన అభివృద్ధి, సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు.అలాగే రెండురోజుల్లో రాబోయే యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ప్రతి డివిజన్, ప్రతి బూత్ లో నిర్వహించాలన్నారు, రాబోయే రోజుల్లో జరగబోయే జిహెచ్ఎంసి గారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు గాని ఏ ఎన్నిక జరిగిన గెలుపే లక్ష్యంగా పనిచేసి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయాలని కోరారు, పదవులు పొందిన ప్రతి ఒక్కరూ కాలనీ సమస్యలపై, ప్రజా సమస్యలపై అధికార పార్టీని ఎప్పటికప్పుడు అభివృద్ధి విషయంలో నిలదీస్తూ, అందరూ సమిష్టిగా కలిసికట్టుగా పనిచేయాలన్నారు, డివిజన్ కు సంబంధించిన కమిటీలను, శక్తి కేంద్ర ఇన్చార్జిలను నియమించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు, ఈరోజు డివిజన్ లో పదవులు చేపట్టిన ఉపాధ్యక్షులు కౌసల్య, అరుణ్ యాదవ్, రాజేష్, శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు అఖిల్, సురేష్, కార్యదర్శులు స్వాతి, లక్ష్మణ్, ఎల్లేష్,సిద్దు, కోశాధికారి సంజీవ్ రెడ్డి మరియు బాధ్యతలు చేపట్టిన డివిజన్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు రాజుశెట్టి, సీనియర్ నాయకులు రమేష్, సోమయ్య యాదవ్, నరసింహ, శాంతిభూషణ్ రెడ్డి, మారం వెంకట్, భరత్, ప్రభాకర్, విజయ లక్ష్మీ, మఖన్ సింగ్, జ్యోతి,అజయ్, సతీష్, నాగరాజు మరియు డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
