రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : తమ రక్తాన్ని సింగరేణి సంస్థ కోసం దారపోస్తున్న కార్మికుల పిల్లల సంక్షేమం కొరకు ప్రత్యేక స్కూల్ బస్సును ఏర్పాటు చేయాలని బుధవారం సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్. వెంకటస్వామి మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ జీ.దేవేందర్ ను కోరారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు స్కూల్ బస్సుల ఫీజులను వసూల్ చేస్తున్న నేపథ్యంలో ఆదాయ పన్నుతో నష్టపోతున్న కార్మికుల బాధను అర్థం చేసుకొని బస్సును ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని అందించారు.