Take a fresh look at your lifestyle.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలి

  • అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఓబిసి సెల్ కన్వీనర్ కత్తి వెంకటస్వామి.
  • ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి జగిత్యాల జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ అంజన్ కుమార్.

కోరుట్ల, ముద్ర విలేకరి:  కోరుట్ల పట్టణ సినారే కళాభవన్ లో బుధవారం రోజు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ మండలాలు, పట్టణాలు, గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ వివిధ పదవుల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం చేపట్టారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఓబిసి సెల్ కన్వీనర్ కత్తి వెంకటస్వామి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, జగిత్యాల జిల్లా కో- ఆర్డినేటర్ డాక్టర్ అంజన్ కుమార్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు లు విచ్చేశారు.  ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, పదవులు ఆశించే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని కోరారు. పార్టీ అధికారంలో ఉన్న లేకపోయిన పార్టీ కోసం కష్ట పడి పని చేసిన వారికి పార్టీలో తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమిరెడ్డి కరంచంద్, కొమిరెడ్డి విజయ్ ఆజాద్, కాంగ్రెస్ పార్టీ గ్రామాల పట్టణ, మండల వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.