- స్వేచ్ఛ ను హరించడం దుర్మార్గం.
- రాజ్యాంగం కల్పించిన వ్యక్తి స్వేచ్ఛ హరించే అధికారం ఎవరికీ లేదు.
- దేశ భద్రత ప్రజల ప్రాణాలు తీసే వారి మీద పెట్టాల్సిన నిఘా మా మీద పెట్టారు.
- ప్రభాకర్ రావు కి ఆదేశాలు ఇచ్చింది ఎవరో రాష్ట్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలి.
- ఎస్ఐబి, ఇంటిలిజెన్స్ అన్నీ ముఖ్యమంత్రుల అధీనంలో ఉంటాయి.
- ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఇచ్చింది ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలి.
- ప్రభుత్వానికి చేతకాకపోతే నిజాయితీగా సీబీఐకి అప్పగించండి..వారే తేలుస్తారు.
- మల్కాజిగిరి ఎండి ఈటల డిమాండ్.
ముద్ర, తెలంగాణ బ్యూరో: రాజ్యాంగం కల్పించిన వ్యక్తి స్వేచ్ఛ హరించే అధికారం ఎవరికీ లేదని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.దేశ భద్రత ప్రజల ప్రాణాలు తీసే వారి మీద పెట్టాల్సిన నిఘా తమ మీద పెట్టారని ధ్వజమెత్తారు.నాయకుల వ్యక్తిగత సిబ్బంది, కుటుంబ సభ్యులు, గన్ మాన్ల ఫోన్ ట్యాంపింగ్ చేశారని ఆరోపించారు. ప్రతి నిమిషం ఎక్కడ ఉన్నారు ఎవరితో మాట్లాడుతున్నారని నిఘా పెట్టారని వ్యాఖ్యానించారు..టీఆర్ఎస్ లో ఉన్నప్పుడే 2018 లోనే తనను హుజురాబాద్ లో ఓడగొట్టేందుకు ప్రయత్నం చేశారని మండిపడ్డారు.2021 లో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో 6 నెలల కాలం పాటు ఎన్నికల ప్రచారంలో కూడా తన ఫోన్ ను టాప్ చేసి ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకొని.. నాయకులను బెదిరించి, డబ్బులు, పదవులు ఆశ చూసి ఓడగొట్టే ప్రయత్నం చేశారన్నారు. అలాగే గజ్వేల్, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లో కూడా ప్రతిక్షణం ట్యాపింగ్ చేశారన్నారు..దమ్ము ధైర్యం లేనివాడు నేరుగా యుద్ధం చేసే సత్తా లేనివాడు ఇలాంటి దుర్మార్గాలు చేస్తారని మండిపడ్డారు.ఇంకా దీనిపైన కాలయాపన చేయడం సరికాదన్నారు. ఇప్పటికే సంవత్సరం గడిచిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అనేక కమీషన్లు కూడా వేసిందన్నార. కానీ ఆ కమీషన్లు ఏమయ్యాయే ప్రభుత్వానికే తెలియాలని ఎద్దేవా చేశారు.అసలు ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉందా? లేదా ? అన్న అనుమానం కలుగుతోందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యన ఏమైనా లోపాయికారి ఒప్పందం జరిగిందా.. ఏలాంటి లాలూచీ పడకపోతే ఎందుకు తూ తూ మంత్రంగా.. నత్త నడకన విచారణ ఎందుకు సాగుతోందని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఉద్యోగ విరణ చేసిన అధికారిని తీసుకొచ్చి నిబంధనలకు విరుద్దంగా ఇలాంటి పనులు చేయించిందని మండిపడ్డారు.కేంద్రం ఆదేశాలను కేసీఆర్ ప్రభుత్వం తుంగలో తొక్కిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. నిజంగానే సదరు అధికారి గొప్ప వాడు అయితే ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకోవాలి తప్ప కీలకమైన రాష్ట్ర దేశ భవిష్యత్తుంకోసం పనిచేసే ఇంటెలిజెన్స్ విభాగం బాధ్యతలు కట్టబెట్టారన్నారు.ఇది సీఎం కనుసన్నల్లో ఉంటుందన్నారు. అందుకే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ప్రభాకర్ రావు ను అక్రమంగా నియమించారన్నారు. అతనితో 9 నెలల పాటు పని చేయించారన్నారు. ఈ కాలంలో అనేక వేల ఫోన్లు ట్యాంపింగ్ చేయించడం సిగ్గుచేటన్నారు.ఒక రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్న ఇంద్రసేన రెడ్డి తో పాటు జడ్జిల, మంత్రుల, ఏమ్మెల్యేల ఫోన్ టాప్ చేయడం దుర్మార్గమన్నారు. చివరకు పోలీసు అధికారుల ఫోన్ కూడా ట్యాప్ చేశారని స్వయంగా ప్రభాకర్ రావు అంగీకరించారన్నారు. అందుకే దేశంలో ప్రజాస్వామ్యం బ్రతకాలి.. ప్రజల హక్కులను కాపాడాలంటే ఎంతటి వారిపైనా అయినా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అప్పుడే నమ్మకం కలుగుతుంగదన్నారు.అలాగే తన భార్య నడుపుతున్న జమున హాచరీ లో పనిచేస్తున్న అందరివి ట్యాప్ చేశారని ఈటల అన్నారు. ఇక నేను, నా భార్య సంభాషణ కూడా వినడం నీచం దుర్మార్గమన్నారు. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము లేకపోతే, నిజాయితీ లేకపోతే కేసును సీబీఐ కి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇందులో ఎవరు దోషులన్నది తేల్చుతుందన్నారు.