Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు

అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోండి
ముద్ర, తెలంగాణ బ్యూరో :

మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడిన కాంగ్రెస్ పార్టీ అధికారం అండతో దౌర్జనాలకు దిగిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు పత్రిక ప్రకటన విడుదల చేశారు. అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు ఓటర్లను ప్రలోభపెట్టారని ఆరోపించారు. కొల్లాపూర్, రామాయంపేట, ఎల్లారెడ్డి, కామారెడ్డిలో ఇష్టానుసారంగా ఓటర్లను భయపెట్టారని ఈసీకి వివరించారు. రెండు రోజులుగా అనేక ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ఎన్నికల సంఘమా? రేవంత్‌రెడ్డి ఎన్నికల సంఘమా? అని ప్రశ్నించారు. మంత్రులే కాన్వాయ్ వేసుకొని వెళ్లి ఓట్లు వేయించారన్న బీజేపీ నేతలు.. డబ్బు మద్యం పంపిణీ చేసి కాంగ్రెస్ గెలవాలని చూశారని పేర్కొన్నారు. అయినా.. ఎన్నికల సంఘం కనీసం పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతుందని ఆరోపించారు. తమ వారిని కిడ్నాప్‌లు చేసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తమ పోరాటాలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బొమ్మెర రామ్మూర్తి, సదానందం, కిరణ్‌గౌడ్, ఫయాజుద్దీన్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.