గచ్చిబౌలి, ముద్ర విలేఖరి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి తండా, ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, ననాక్రమ్ గూడ, జనచైతన్య కాలనీ , కాజా గూడ కుమ్మరి బస్తి, కాలనీలలో రూ. 4 కోట్ల 51 లక్షల 50 వేల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, పైప్ లైన్ నిర్మాణము పనులకు, మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం పనులకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గం మరియు కాలనీ ల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం 4 కోట్ల 51 లక్షల 50 వేల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు , పైప్ లైన్ నిర్మాణము పనులకు, మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగినది అని, సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, కాలనీ వాసులకు ఉపశమనం లభించింది అని, మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని చైర్మన్ గాంధీ అన్నారు. సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకం లో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని చైర్మన్ గాంధీ తెలియచేసారు. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని, ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని చైర్మన్ గాంధీ చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని PAC చైర్మన్ అధికారులను ఆదేశించారు.
- గోపన్ పల్లి తండా లో రూ.90.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీ సీ రోడ్ల నిర్మాణం పనులకు.
- గోపన్ పల్లి ఎన్టీఆర్ నగర్ లో రూ.78.50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీ సీ రోడ్ల నిర్మాణం పనులకు.
గోపన్ పల్లి తాజ్ నగర్ లో రూ.73.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీ సీ రోడ్ల నిర్మాణం, కాజా గూడ కుమ్మరి బస్తి లో రూ.45.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణం పనులకు, జనచైతన్య కాలనీ లో రూ.85.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణం పనులకు, జనచైతన్య కాలనీ మరియు ననాక్రమ్ గూడ లో రూ.80.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం పను అండర్ గ్రౌండ్ డ్రైనేజి, మంచి నీటి నిర్మాణము పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది చైర్మన్ గాంధీ తెలియచేసారు.ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
