మహేశ్వరం, ముద్ర విలేకరి: మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ తీగల రంజిత్ రెడ్డి పార్టివ దేహానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, రాజేంద్రనగర్ అసెంబ్లీ ఇన్‌చార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డిలు, ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు, రంజిత్ రెడ్డి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.ఈ కార్యక్రమంలో మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టిఆర్ఎస్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, సిద్ధల లావణ్య బీరప్ప, అర్కల భూపాల్ రెడ్డి, దిండు భూపేష్ గౌడ్, మేకల రవీందర్ రెడ్డి, అనిల్ యాదవ్, దీప్ లాల్ చౌహాన్, సిద్దాల అంజయ్య, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అశోక్, ఎల్చాల సుదర్శన్ రెడ్డి, రామిడి రామిరెడ్డి, పెద్దబావి ఆనంద్ రెడ్డి, సమ్ రెడ్డి వెంకట్ రెడ్డి, రాజు కుమార్, వీర రాఘవరెడ్డి, మహిళా అధ్యక్షురాలు సునీత తదితరులు పాల్గొన్నారు.