Take a fresh look at your lifestyle.

భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు 

ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి: కల్వకుర్తి పట్టణంలోని వర్క్ వర్కాంటిన్ మెమోరియల్ చర్చ్ లో శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.క్రైస్తవులు క్రీస్తు మరణాన్ని స్మరించుకుంటూ 40 రోజులుగా ఉపవాస దీక్షలు శుక్రవారంతో ముగిశాయి.ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు క్రీస్తు మరణాన్ని గుర్తు చేసుకుంటూ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.చర్చిలో పాస్టర్ ఏసుక్రీస్తు యొక్క బోధనలను వినిపించారు మనిషి చనిపోయేంత వరకు ఏసుప్రభు బోధనలను స్మరించుకుంటూ సమాజానికి ప్రజలకు ఎలా ఉపయోగకరంగా ఉండాలో తెలిపారు.కార్యక్రమంలో చైర్మన్ జోహార్న, వైస్ చైర్మన్ స్టీవెన్ సన్, సెక్రటరీ రామస్వామి, జాయింట్ సెక్రటరీ, జగదీష్, ఇజ్రాయిల్, సురేష్ బాబు, ఇంజమూరి రాజు, ప్రేమ్, విజయ్ కుమార్, బొల్లె రాజు, యూత్ చైర్మన్ నేరటి రవి, సెక్రటరీ ఆనంద్, యూత్ వైస్ చైర్మన్, జ్యోతి ప్రసాద్, ఆనంద్ కుమార్, ఎంబి  వార్కంటి న్ మెమోరియల్ చర్చ్ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.