Take a fresh look at your lifestyle.

ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

ముద్ర, భువనగిరి ప్రతినిధి :
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
శనివారం రామన్నపేట మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.
హాస్టల్ ఉన్న వంట గది, డైనింగ్ రూమ్ ని , విద్యార్థులు పడుకునే బెడ్స్ పరిశీలించారు. డైనింగ్ రూమ్ శుభ్రంగా లేదని ప్రతి రోజు శుభ్రపరుచుకోవాలి అని తెలిపారు. ప్రతి రోజు మెనూ ప్రకారం విద్యార్థులకి మంచి నాణ్యమైన భోజనం పెడుతున్నార లేదా అని ఆరా తీశారు. విద్యార్థులకు వండే ఆహారం పరిశుభ్రంగా వంట చేయాలన్నారు .హాస్టల్ లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. మంచినీటి ఆర్. ఓ ప్లాంట్ ను పరిశీ లించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన మంచినీరు అందించాలన్నారు.
ఈ కార్యక్రమం లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.