- మండలంలో జోరుగా వరినాట్లు వేస్తున్నారు.
- వరినాట్ల కూలీలకు పెరిగిన డిమాండ్.
గొల్లపల్లి, ముద్ర విలేకరి : వర్షాకాలంలో వరి సాగు జోరందుకుంది. ఎక్కడ చూసినా గ్రామాల్లో వ్యవసాయ కూలీలు రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండల వ్యాప్తంగా వరి సాగు చేస్తున్నారు. కొందరు రైతులు వరి సాగుపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. రైతులు బావులు, బోర్ల కింద అందుకు తగ్గట్టుగానే వరి నారుమళ్లు పోసుకుని పొలాలను దున్ని జోరుగా వరి నాట్లు వేస్తున్నారు.మరికొంత మంది రైతులు నాట్లు వేయడానికి దున్ని సిద్ధగా చేసిన్నారు. గ్రామాల్లో ముమ్మరంగా వరినాట్లు వేస్తున్నారు.ఒకేసారి రైతులంతా వరి నాట్లు వేస్తుండటంతో కూలీలు దొరకడం లేదాని. కూలీ ల కొరత ఏర్పడంతో మహిళలకు రోజుకు నాట్లు వేసేందుకు 450 ఉన్న కూలీ ఇప్పుడు 500 కూడా ఇచ్చి తీసుకువెళ్తున్నారు.అయినా కూలీలు దొరకడం లేదని రైతులు వాపోతున్నారు.వివిధ గ్రామాలకు చెందిన కూలీలను వరినాట్లు వేసేందుకు రైతులు కూలీలను ఆటోల్లో తరలిస్తున్నారు.కూలీతో పాటు ప్రయాణ ఖర్చులు భరించాల్సి వస్తుండటంతో సాగు ఖర్చులు మరింత పెరుగుతున్నాయని రైతులు పేర్కొన్నారు.
