Take a fresh look at your lifestyle.

Parakala: గెలిపిస్తే సేవకుడిగా పని చేస్తా. టిఆర్ఎస్ అభ్యర్థి పాలకుర్తి గోపి.

 

ముద్ర. పరకాల.

తనని గెలిపిస్తే వార్డు ప్రజలందరికీ సేవకుడిగా పనిచేస్తానని టిఆర్ఎస్ అభ్యర్థి పాలకుర్తి గోపి వార్డు ప్రజలను కోరారు. శనివారం ఆయన తన మద్దతు ధరలతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్ల వద్దకు వెళుతూ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనందున బాకీ కార్డు చేతబట్టి ఓటర్లకు వివరిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ మనకు బాకీ పడిన వాగ్దానాలను ఇప్పటివరకు అమలు చేయలేదని వాటిని ఇచ్చిన తర్వాత ఓట్లు అడగాలని అన్నారు. గత రెండు పర్యాయాలు పరకాల మున్సిపాలిటీలో 17వ వార్డు నుండి గెలుపొందాలని ఆ వార్డులో కోట్లాది రూపాయలతో ప్రజల మౌలిక అవసరాలను తీర్చడం జరిగిందన్నారు.ఆ అనుభవంతో 20వ వార్డులో తనను గెలిపిస్తే ప్రజల అవసరాల మేరకు పనిచేస్తానన్నారు. గత ప్రభుత్వం ఇంటింటికి మంచినీటి నల్లాలను అమర్చడం జరిగిందని అదేవిధంగా వార్డులో అపరిస్కృతంగా ఉన్న సిసి రోడ్ల నిర్మాణం మురుగునీటి కాలువల నిర్మాణం చేపట్టి పని చేస్తాను అన్నారు. 20వ వార్డులో ప్రజల ఆదరణ టిఆర్ఎస్ పార్టీపై ఉందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈనెల 11న జరిగే మున్సిపాలిటీ ఎన్నికలలో 20వ వార్డు నుండి తాను పోటీ చేస్తున్నందున కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వేడుకుంటున్నాడు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.