- మున్సిపల్ కమిషనర్ స్పందన.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం వివిధ కార్పోరేషన్ ల అధ్వర్యంలో రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా అందించే వ్యక్తిగత రుణాల కోసం దరకాస్తు చేసుకున్న లబ్దిదారులకు పారదర్శంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందన తెలిపారు. జగిత్యాల పట్టణంలో మొత్తం 6100 ఫైన దరకాస్తులు వచ్చాయని, ఎస్టి కార్పోరేషన్, ఈబిసి, మైనారిటీ, క్రిస్టియన్ కార్పోరేషన్లకు సంబధించి 1300 దరకాస్తులు రాగ 900 మంది ఇంటర్వ్యూలకు హజర్ అయ్యారని తెలిపారు. ఎస్సి కార్పోరేషన్ కు సంబంధించి 621 దరకాస్తులు వచ్చాయని ఆదివారం 500 మంది లబ్దిదారులు ఇంటర్వ్యూలకు వచ్చారని తెలిపారు. సోమవారం జరిగే బిసి కార్పోరేషన్ ఇంటర్వ్యూలకు ఎక్కువ మంది వస్తారని వారికోసం ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఇంటర్వ్యూలలో ఆయా కార్పోరేషన్, బ్యాంకు అధికారులు పాల్గొని యూనిట్లు పరిశీలిస్తున్నారని తెలిపారు. ఎవరైనా వివిధ కారణాలతో ఇంటర్వ్యూలకు హాజరు కాకపోతే సోమవారం ఆయా జిరాక్స్ కాపిలతో హాజరు కావాలని కమిషనర్ స్పందన కోరారు.
- బిసి కార్పొరేషన్ ఇంటర్వ్యూలు దేవిశ్రీ గార్డెన్ లో.
బిసి కార్పొరేషన్ రాజీవ్ యువ వికాసం దరకాస్తులు అధిక సంఖ్యలో ఉండటం కారణంగా సోమవారం దేవిశ్రీ గార్డెన్ లో జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న దరఖాస్తుదారులకి ఇంటర్వ్యూలు నిర్వహించబడునని మున్సిపల్ కమిషనర్ స్పందన తెలిపారు. ఇతర కార్పొరేషన్ల వారు వివిధ కారణాలతో శనివారం, అదివారం హాజరు కాకపోతే సోమవారం రావచ్చని తెలిపారు.
