Take a fresh look at your lifestyle.

బీఆర్​ఎస్​ ది అస్తిత్వ పోరాటం

  • లిక్కర్​ రాణికి రాహుల్​ గురించి మాట్లాడే అర్హత లేదు.
  • బీఆర్ఎస్ పదేండ్లలో పదివేల భూములు దోచుకుంది.
  • హైదరాబాద్ భూముల అమ్మకాల లెక్కలపై కవిత.. కేసీఆర్​ ను ప్రశ్నించాలి.
  • టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్​.

ముద్ర, తెలంగాణ బ్యూరో : తమ పదేండ్ల పాలనలో అన్ని రంగాల్లో, అన్ని వర్గాలను దోచుకున్న కేసిఆర్ అండ్ కంపెనీ అస్తిత్వం నిల్పుకోవడం కోసం ఆరాటపడుతుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధవ్యాఖ్యానించారు.హైదరాబాద్ లో జరుగుతున్న భారత్ సమ్మిట్ కు హాజరవుతున్న రాహుల్ గాంధీని ఉద్దేశించి..దారి తప్పిన తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు..మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. దొంగల ముఠాలా రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ కుటుంబం హెచ్ సీ యూ భూముల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కేసిఆర్ కుటుంబం గడిచిన పదేళ్లలో 10 వేలకు పైగా భూములను దోచుకుందని ఆరోపించారు. లిక్కర్ వ్యాపారం చేసిన కల్వకుంట్ల కవిత (రాణి)కు రాహుల్ గాంధీ పై మాట్లాడే అర్హత లేదని తేల్చి చెప్పారు.తనను తాను ఒక మెగా రౌడీ అని చెప్పుకొని తిరుగుతున్న కవిత, రాహుల్ గాంధీ గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ భూముల అమ్మకాల లెక్కలపై కవిత మాట్లాడాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ చుట్టు పక్కల భూములను కారు చౌకగా కేటీఆర్ తమ అనునయులకు దోచి పెట్టారని ఆరోపించారు. కవిత వాళ్ల నాన్న కేసీఆర్ తో తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పించాలని చురకలంటించారు.

Leave A Reply

Your email address will not be published.