Take a fresh look at your lifestyle.

ఐ ఎన్ టి యు సి కోర్ కమిటీ సమావేశం

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: ఐఎన్టీయూసీ సింగరేణి కోర్ కమిటీ సమావేశం కొత్తగూడెం యూనియన్ కార్యాలయంలో జరిగింది.ఈ సమావేశ ముఖ్య అతిథి తెలంగాణ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ మార్గదర్శకత్వం అందించారు.ఈ సమావేశ వివరాలను జెట్టి శంకర్రావు,కోరు కమిటీ సభ్యులు కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు,మీడియా ద్వారా పత్రికా ప్రకటనగా వెల్లడించారు.ఐఎన్టీయూసీ సాధించిన ఆర్థిక సంక్షేమ ఫలితాలను కార్మికుల లోకి మరింత బలంగా తీసుకెళ్లా ల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.”రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యాలతో కార్మిక హక్కుల కోసం ఐఎన్టీయూసీ చేస్తున్న చర్చలు,విన్నపాలు వంటి నిరంతర కృషిని సోషల్ మీడియా వేదికగా కార్మికులకు ఎప్పటికప్పు డు తెలియజేస్తూ,వారిలో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.కార్మిక సంక్షేమానికి సంబంధించి ఐఎన్టీయూసీ ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం,కోల్‌బెల్ట్ మంత్రులు, సానుకూలంగా స్పందించిన విషయాన్ని కార్మికులకు తెలియజేయాలని సూచించారు.సింగరేణి భవిష్యత్తు కోసం ఐఎన్టీయూసీ చేస్తున్న కృషి ని ప్రస్తావిస్తూ,అది కార్మికులకు అవగాహన కలిగేలా ప్రచారం చేయాలని కోరారు.పిట్ కమిటీ, బ్రాంచ్ కమిటీ, కేంద్ర కమిటీలు ఐక్యంగా పనిచేస్తేనే కార్మికుల మన్ననలు పొందగల మని తెలిపారు.విభేదాలు పక్కన పెట్టి సమిష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.సొంతింటి పథకం,అలవెన్సులపై ఇన్కమ్ టాక్స్ రీయింబర్స్‌మెంట్ వంటి హక్కులు రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో ఐఎన్టీయూసీ కృషి వల్లే సాధ్యమన్న విషయాన్ని కార్మికులకు నమ్మకం కలిగించేలా చెప్పాలన్నారు.రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టియుసి ని కార్మికులు ఏకపక్షంగా గెలిపించేలా యూనియన్ శ్రేణులు ఐక్యతతో, ఉద్యోగునీ ఉద్యోగుల భారీ సభ్యత్వ నమోదుకు కార్యాచరణ చేపట్టాలని స్పష్టంగా దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశంలో కోర్ కమిటీ కేంద్ర నాయకులు నరసింహరెడ్డి, ధర్మపురి, త్యాగ రాజన్,జెట్టి శంకర్రావు జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.