ముద్ర ప్రతినిధి, భువనగిరి: భువనగిరి పట్టణంలోని హనుమాన్ వాడ 7 వార్డులో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ హనుమంతరావు అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి బుధవారం ఉదయం 5.00 గంటలకు ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్బంగా ప్రజలతో వార్డు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.మహిళలతో రోజు కృష్ణ వాటర్ సరిపోను వస్తున్నాయ లేదో ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరిని ఆరా తీశారు.ప్రజాపాలన లో దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త రేషన్ కార్డు లు వచ్చాయా, రేషన్ బియ్యం వస్తున్నాయా అని అడిగారు.నర్సింహా అనే వ్యక్తికి 500 రూపాయలకి గ్యాస్ వస్తుందా అని అడగగా అప్పుడు ఆయన రాలేదని చెప్పాడం తో వేంటనే సంబంధిత సివిల్ సప్లయ్ అధికారికి ఫోన్ చేసి సబ్సిడీ వచ్చే విధంగా చూడాలని ఆదేశించారు.200 యూనిట్స్ ఉచిత కరెంటు ఇస్తున్నారా లేదా అని అడిగారు రాని వారికి సంబందిత యస్.ఇ. కి వాట్సాప్ ద్వారా అప్లికేషన్ పంపించి ఉచిత కరెంట్ వచ్చే విధంగా చూడాలన్నారు.ఇందిరమ్మ ఇళ్ళకి దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి ఎంక్వయిరీ కి వచ్చారా లేదా అని అడిగారు. రాని వారికి ఆర్. పి ద్వారా కొత్త అప్లికేషన్ చేయించవలిసినదిగా సూచించారు.స్థానిక మహిళలు అభ్యర్థన మేరకు కొత్తగా వాటర్ ట్యాంక్ ని నిర్మించాలని మున్సిపల్ కమీషనర్ ని ఆదేశించారు.స్థానిక దేవాలయం వెనుక ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసి పూల మెక్కలు లాంటివి పెట్టి గార్డెన్ లాగా ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ని ఆదేశించారు.బుధవారం కాలనీలో స్పెషల్ డ్రైవ్ పెట్టి కాలనీలో మురికి కాల్వలు శుభ్రంగా ఉంచాలని శానిటరి ఇన్స్పెక్టర్ ని ఆదేశించారు.