Take a fresh look at your lifestyle.

కొండాపూర్ డివిజన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన పిఏసీ చైర్మన్ గాంధీ

మాదాపూర్, ముద్ర: కొండాపూర్ డివిజన్ పరిధిలోని ఓయూ కాలనీలో 80 లక్ష రూపాయల అంచనా వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పిఏసీ చైర్మన్ అరికపూడి గాంధీ కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ హెచ్ ఎం డబ్ల్యు ఎస్ అధికారులు స్థానిక నాయకులతో కలసి శంకుస్థాపన చేశారు. డ్రైనేజీ సమస్యలు లేకుండా శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కొండాపూర్ డివిజన్ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి సందర్బంగా ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తు లో మరిన్ని అభివృద్ది పనులు చేపడతామని అన్నారు.శంకుస్థాపన కార్యక్రమంలో హెచ్ ఎం డబ్ల్యు ఎస్ డిజీఏం శరత్ కుమార్ రెడ్డి, మేనేజర్ సందీప్, టెక్నికల్ అసిస్టెంట్ రమేష్, వర్క్ ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్, మనోజ్, సీనియర్ నాయకులు ఊట్ల కృష్ణ, ఊట్ల దశరథ్, ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్, పెరుక రమేష్ పటేల్, కరీం లాలా, బుడుగు తిరుపతి రెడ్డి, తిరుపతి యాదవ్, వెంకటేష్, శ్రీనివాస్ చౌదరి, తిరుపతి మంగళరాపు, వెంకటేష్, రజనికాంత్, గోపి, అబ్దుల్ వసీం, అభి అక్షయ్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.