- భారతదేశ రాజకీయ చరిత్రలో బీజేపీ ఒక ప్రభంజనం – గండు శ్రీనివాస్ గౌడ్ , బీజేపీ అచ్చంపేట పట్టణ అధ్యక్షులు.
అచ్చంపేట, ముద్ర: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ వేడుకలు పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షులు గండు శ్రీనివాస్ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించి, భరత మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ దేశాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, బిజెపిపార్టీ కి కార్యకర్తలు ప్రజలకు మరింత చేరువ కావాలని, వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.సీనియర్ నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంగ్య నాయక్ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపించడానికి కృషి చేయాలని కార్యకర్తలను కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మండికారి బాలాజీ, రేనయ్య, సైదులు యాదవ్, శ్రీను నాయక్, రాం చంద్రయ్య, రంగినేని రవీందర్, గోలి రేనయ్య, చందులాల్ చౌహాన్, శివ చంద్ర, అమర్, మధు భూపాని, బయ్య రాజు, అభినయ్, చైతన్య చారి, భాస్కర్, బాలకోటి, వెంకటేష్, మురళీ, తదితరులు పాల్గొన్నారు.
