Take a fresh look at your lifestyle.

వైభవోపేతంగా రాములోరి కళ్యాణం

  • ఆర్కేపీలో శ్రీరామనవమి వేడుకలు.
  • కళ్యాణాన్ని తిలకించిన భక్తులు.

రామకృష్ణాపూర్,ముద్ర : పట్టణంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాములోరి కళ్యాణాన్ని ఆదివారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ రమణీయంగా.. కమనీయంగా సాగిన రాములోరి కళ్యాణాన్ని భక్తులు తిలకించారు. స్థానిక శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్,మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ జి.దేవేందర్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దేవతామూర్తుల విగ్రహాలను దర్శించుకున్నారు.అలాగే విజయ గణపతి దేవాలయంలో రాములోరి కల్యాణాన్ని వైభవంగా జరిపారు.పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు,వోడ్నాల శ్రీనివాస్,గాండ్ల సమ్మయ్య,పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.