Take a fresh look at your lifestyle.

దరువు జాతర వాల్ పోస్టర్ విడుదల

ముద్ర ప్రతినిధి, మెదక్
హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఈ నెల 20న జరుగబోయే దరువు జాతర వాల్ పోస్టర్ను మెదక్ తెలంగాణ భవన్ వద్ద మెదక్ జిల్లా కళాకారులు విడుదల చేశారు.
ఉద్యమనిరుద్యోగ కళాకారుల మెదక్ జిల్లా అధ్యక్షులు గుడాల సత్యనారాయణ, కళాకారులు నీరుడి సాయిలు, వరిగొంతం శేఖర్ చారి, అల్లారం పాపయ్య, దేవరాజు, చంద్ర శేఖర్ పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమం నుండి మొదలుకొని ఈనాటి వరకు ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసిన దరువు ఎల్లన్న, దరువు అంజన్న ఆధ్వర్యంలో దరువు వేదికను స్థాపించి నేటికీ 25 సంవత్సరాల సందర్భంగా వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీడియో పాటను కూడా విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఉద్యమ కారులు, ఉద్యమ కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ జాతరని విజయవంతం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.