మొయినాబాద్, డిసెంబర్ 28: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
మధ్యాహ్నం 12 గంటలకు ధన్వంతరి సహిత సామూహిక సుదర్శన హోమం జరిగింది. వందలాది జంటలు, కుటుంబ సమేతంగా హోమంలో పాల్గొన్నారు.
సాయంత్రం నాలుగు గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది. ఆ తర్వాత స్వామివారి ఉత్సవ విగ్రహాలను కనకమామిడి గ్రామంలో ఊరేగించారు.

మహిళల కోలాటంతో గ్రామంలో ఉత్సవ శోభ నెలకొన్నది. ఆలయ కమిటీ ఛైర్మన్ కొండా లక్ష్మీకాంతరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు.