Take a fresh look at your lifestyle.

రైతులకు కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం హక్కులు కల్పించండి : రైతు కమిషన్ కు కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి

రైతులకు కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం హక్కులు కల్పించండి
రైతు కమిషన్ చైర్మన్, సభ్యులకు కవిత విజ్ఞప్తి
రైతుకు మేలు చేసే చట్టం అమలు చేయండి

ముద్ర, తెలంగాణ బ్యూరో :

రాష్ట్రంలో 60 రకాల విత్తనాలను పండిస్తూ తెలంగాణను ‘సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా’గా చేసేందుకు అహర్నిషలు కృషి చేస్తున్న రైతులకు 2007లో పాసైన కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం ప్రకారం ఉండాల్సిన హక్కులు ఉండటం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రైతుకు మేలు చేసే విధంగా ఆ చట్టాన్ని వాడకోవటం లేదన్నారు. ముఖ్యంగా సీడ్ పత్తి రైతులకు ఇచ్చే అడ్వాన్స్‌ను కూడా ఇంటరెస్ట్ తీసుకుంటూ భూములు రాయించుకుంటున్నారని చెప్పారు. జిల్లా కలెక్టర్లు, వ్యవసాయాధికారులు రైతుల పక్షాన నిలవటం లేదన్న కవిత… చట్టంలో ఉన్న లోటు పాట్లను సరిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, సభ్యులను కలిసిన ఆమె రాష్ట్రంలో విత్తన పంటలు సాగు చేస్తున్న రైతుల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా కమిషన్ కు వినతి పత్రం అందజేసి అక్కడ మీడియాతో మాట్లాడారు. చాలా మంది సీడ్ పండిస్తున్న రైతులు మన రాష్ట్రంలో ఉన్నందున మంచి సీడ్ చట్టం రావాల్సి ఉందన్నారు. రైతు కమిషన్ చైర్మన్‌గా సీడ్ పండించే రైతులకు మంచి జరిగేలా చూడాలని కోదండరెడ్డిని కోరారు. కరీంనగర్‌లో వరి సీడ్ పండిస్తున్న రైతులకు ఎకరానికి 75 వేలు ఇస్తున్నారనీ కానీ గద్వాల్‌లో సీడ్ పత్తి పండించే రైతులకు అడ్వాన్స్, ఫెస్టిసైడ్స్‌కు ఇచ్చే డబ్బులకు కూడా భూమి తనఖా పెట్టించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా 250 గ్రాముల తరుగు కూడా తీస్తున్నారని ఆరోపించారు.

రూ.200 కోట్లు రావాల్సి ఉంది..
కరీంనగర్‌లో వరి సీడ్ పండించే రైతులకు ప్రొక్యూర్ చేసిన తర్వాత మిగిలిన వాటిని కమర్షియల్‌గా అమ్ముకునే స్వేచ్చ ఉందని కవిత కమిషన్ కు వివరించారు. కానీ గద్వాల్‌లో సీడ్ పత్తి రైతులను మల్టీ లెవల్‌లో మోసం చేస్తున్నారని ఆరోపించారు. సీడ్ పత్తి ఆర్గనైజర్స్, మీడియేటర్లు రైతులను పట్టి పీడిస్తున్నారన్నారు. ఎకరానికి ఎంత ఇస్తారో చెప్పిన తర్వాత పంట వచ్చినా రాకపోయిన రైతులకు డబ్బులు ఇవ్వాల్సి ఉందన్నారు. పంట రాకపోతే రైతులు పడే మానసిక ఆందోళనను కూడా పట్టించుకోవాలని చట్టంలో ఉందని వివరించారు. కానీ కంపెనీలు, ఆర్గనైజర్లు పట్టించుకోవటం లేదన్నారు. గద్వాల్ జిల్లాలో పరిస్థితిని తాము ప్రత్యక్షంగా చూశామన్నారు. కరీంనగర్‌లో వరికి ఎకరానికి 75 వేలు ఇచ్చినట్లే, గద్వాల్‌లో రైతులకు కూడా ఇప్పించాలని కమిషన్ ను కోరారు. సీడ్ ఇచ్చిన తర్వాత అది ఫెయిల్ అయితే దానికి రైతుకు సంబంధం ఉండకూడదన్నారు. కంపెనీ వాళ్లు ఇచ్చే సీడ్ ఫెయిల్ అయితే దానికి కంపెనీయే బాధ్యత వహించాలన్నారు. కానీ మీరు సరిగా నాటలేదంటూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని దుయ్యబట్టారు. గద్వాల్ జిల్లాలో 10 వేల మంది సీడ్ పత్తి రైతులకు రూ. 2 వందల కోట్లు రావాల్సి ఉందన్న కవిత… మీరు జోక్యం చేసుకోని రైతులకు మంచి జరిగేలా చూడాలని కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి విన్నవించారు. మోస్ట్ పాయిజన్ ఫెస్టిసైడ్స్ కూడా మన రాష్ట్రంలో బ్యాన్ కాలేదనీ కనీసం వాటిని పరిమితంగా అమ్మేలా అయిన చర్యలు తీసుకోవాలని కవిత విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.