Take a fresh look at your lifestyle.

రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు. ప్రిన్సిపాల్ సాయి ఈశ్వరి……

 

ముద్ర నడిగూడెం…..

ముఖ్యమంత్రి కప్ పోటీలలో భాగంగా జిల్లా స్థాయి ఆటల పోటీల నుంచి గెలుపొంది రాష్ట్రస్థాయి అండర్ 14 యోగ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సాయి ఈశ్వరి గురువారం తెలిపారు. మండల పరిధిలోని కరివిరాల గ్రామంలో గల మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల విద్యార్థులు అండర్ 14 బాలికల విభాగంలో సబ్ జూనియర్స్ విభాగంలో ఎ చందన, జి నాగశ్రీ, ఏ భవ్య శ్రీ, బాలుర విభాగంలో కే తనిష్ విద్యార్థులు రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి యోగ పోటీలలో పాల్గొంటారని ప్రిన్సిపాల్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులను, ఉపాధ్యాయులు అభినందించారు. స్కూల్ పిడిని ప్రత్యేకంగా అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.