Take a fresh look at your lifestyle.

ఘనంగా వీరభద్ర బృంగీశ్వర స్వామి ఊరేగింపు

  • భక్తుల దర్శనార్థం ప్రత్యేక ఏర్పాటు చేసిన ఆలయ నిర్వాహకులు

ముద్ర, గండిపేట్ :ఆ పరమేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని గండిపేట్ మండల పరిధిలోని మంచిరేవుల మచిలేశ్వర స్వామి ఆలయ నిర్వాహకులు తెలిపారు.శుక్రవారం మహాశివరాత్రి వేడుకలను పురస్కరించుకొని బృంగేశ్వర స్వామి ఊరేగింపును ఘనంగా నిర్వహించారు.ఈ మేరకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు.పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.స్వామి పురవీధుల్లో పయనిస్తూ ప్రజలను ఆశీర్వదిస్తూ ముందుకు సాగడంతో సంతోషంగా వారి ఆశీస్సులను పొందారు.అనంతరం అగ్ని గుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు.శనివారం రథోత్సవం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో నార్సింగి మాజీ కౌన్సిలర్ ఎల్. పద్మ, నార్సింగి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మేకల ప్రవీణ్ యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ పాపిరెడ్డి, గ్రామ పెద్దలు పురోహితులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.