ముద్ర గండిపేట్ : బండగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ కమిషనర్ శరత్చంద్ర అన్నారు. శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో ఆయన పలు ఎజెండాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.అందులో భాగంగా రంజాన్ మాసాంతర వరకు ఏర్పాట్లు, పలు వార్డులలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ, ట్రేడ్ లైసెన్స్ల జారీ, ఎల్ఆర్ఎస్ సర్వే అడ్వర్టైజ్మెంట్ పన్నుల వసూలు, ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్లు, ఆల్ అసిస్డ్ అండర్ అస్సేజ్డ్ వసూలు, ఇంజనీరింగ్ విభాగంలో పలు పనుల పురోగతి,స్వయం సహాయక సంఘాలు, పలు లక్ష్యాల సాధన, స్వచ్ఛ సర్వేక్షన్ 2025 సిటిజన్ ఫీడ్బ్యాక్, తాగునీటి వనరులపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులకు పలు అంశాలపై దేశానిర్దేశం చేశారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తే క్రమంలో అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మేనేజర్ ఈ మంజులత,డిప్యూటీ ఈఈ జి యాదయ్య, పలు విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.