Take a fresh look at your lifestyle.

దేవాలయ ద్వితీయ వార్షికోత్సవంలో పాల్గొన్న గువ్వల

అచ్చంపేట, ముద్ర: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బద్మూర్ మండలం జిన్ కుంట శ్రీ కనకాల మైసమ్మ అమ్మవారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవంలో పూజలు చేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు – అమల దంపతులు పాల్గొన్నారు. కనకాల మైసమ్మ అమ్మవారు చాలా మహిమగల దేవత అని గువ్వల బాలరాజు అన్నారు.ఈ కనకాల మైసమ్మ దేవాలయాన్ని తమ విఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పునర్నిర్మించడం నా పూర్వజన్మ సుకృతం అని అన్నారు.సతీ సమేతంగాఅమ్మవారికి కుంకుమార్చన అభిషేకం, హోమాన్ని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వలబాలరాజు – అమల దంపతులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు ఎల్లవేళలా సుభిక్షంగా ఉండాలని శ్రీ కనకాల మైసమ్మ అమ్మవారిని వేడుకున్నారు.అనంతరం వేద పండితుల దివ్య ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.