Take a fresh look at your lifestyle.

నిరుపేదపై వరాల జల్లు.. “ఇందిరమ్మ” ఇల్లు..

 

కొండాపురంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం చేయించిన మార్కెట్ యార్డు చైర్మన్ కుర్వ హన్మంతు

ముద్ర, గద్వాల:

ఇందిరమ్మ ఇల్లు గూడు లేని నిరుపేదలకు వరాల జల్లు అని గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ కుర్వ హన్మంతు‌ అన్నారు. కొండాపురం గ్రామంలో పులుసు తిమ్మారెడ్డి అనే లబ్ధిదారుడికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం గృహప్రవేశం అంగరంగ వైభవంగా చేయించారు.


ఈ సందర్భంగా మార్కెట్ యార్డు చైర్మన్ మాట్లాడుతూ నిరుపేదలను ఇంటి యజమానులను చేసే కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని దానిని అంకితభావంతో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పవన్ కుమార్‌రెడ్డి, మండలాధ్యక్షులు ఉరుకుందు , కేటిదొడ్డి సర్పంచ్ నారాయణ, నాయకులు తిమ్మారెడ్డి, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.