ముద్ర/వీపనగండ్ల: బాల్య వివాహాలు చేయటం,చేయించడం చేస్తే చట్టరితనేరమని,గ్రామాలలో బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు లేదా మండలాధికారులకు వెంటనే సమాచారం అందించాలని తాసిల్దార్ వరలక్ష్మి అన్నారు.తాసిల్దార్ కార్యాలయంలో జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ,జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాల్య వివాహలపై ప్రజలకు అవగాహన కల్పించారు.తహశీల్దార్ వరలక్ష్మి మాట్లాడుతూ మండల పరిధిలో ఎ ఒక్క గ్రామంలో అయిన బాల్య వివాహం చేసిన లేదా చెయ్యాలని చూసిన ఎవరైతే ఈ చర్యకు పాల్పడుతారో వారి అందరిపైన బాల్య వివాహ నిషేధ చట్టం 2006 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.అత్యవసర సమయంలో బాలలకు సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ప్రీ నెంబర్ 1098,112,100 కు సమాచారాన్ని అందించాలని సూచించారు.ఈ సందర్భంగా డి సి పి యు సిబ్బంది నరేందర్, సోషల్ వర్కర్ తో కలిసి బాల్య వివాహలు బాలలకు సంబంధించిన వివిధ రకాల పోస్టర్లను ఆవిష్కరించారు.కార్యాక్రమంలో డిప్యూటీ తాసిల్దారు కృష్ణమూర్తి, ఆర్ ఐ కురుమూర్తి,కార్యాలయ సిబ్బంది చిన్నమ్మ,రాము, కృష్ణ, మధు, దశరథం తదితరులు ఉన్నారు.