Take a fresh look at your lifestyle.

వనపర్తి జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పి రావుల గిరిధర్

ముద్ర ప్రతినిధి, వనపర్తి: శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా వనపర్తి జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు “30 పోలీస్ ఆక్ట్” అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ,30 పోలీస్ ఆక్ట్ ఈ నెల, మార్చి 01 నుండి 31 వరకు అమల్లో ఉన్నందున జిల్లాలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు,ఊరేగింపులు,ధర్నాలు,ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు,బహిరంగ సభలు,ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేయరాదని తెలిపారు.అనుమతులు లేకుండ కార్యక్రమాలు నిర్వహించిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించేందుకు దారి తీసే సమావేశాలు, జన సమూహం చేయడం పూర్తిగా నిషేధమని తెలిపారు.సోషల్ మీడియా నందు అనవసరమైన విషయాలను, రాజకీయ నాయకుల,కుల మతాల మధ్య చిచ్చు పెట్టే అంశాలను వ్యాప్తి చేసిన వారిపై కేసులను నమోదు చేయబడతాయని తెలిపారు.చట్టపరంగా జారీ చేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే 30 పోలీస్ ఆక్ట్ ప్రకారం శిక్ష అర్హులవుతారని తెలిపారు.నిషేధంలో ఉన్న నిబంధనలు తప్పనిసరిగా అందరూ పాటించాలని ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న ముందస్తు దరఖాస్తు చేసుకునే అనుమతులు తీసుకోవాలని ఎస్పీ కోరారు.

Leave A Reply

Your email address will not be published.