- భారీగా ట్రాఫిక్ జాం.
మాదాపూర్, ముద్ర విలేఖరి: నగరంలోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్డిపై కారులో మంటలు చెలరేగడంతో తీగల వంతెనపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గచ్చిబౌలి నుండి జూబ్లీహిల్స్ వైపు వెళుతున్న కారులో వంతెన వైకి రాగానే పొగలు ప్రారంభమౌవడంతో ఊహించని పరిణామానికి అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. అప్రమత్తమైన కారులోని ఇద్దరు కారును వదిలి పక్కకు తప్పుకున్నారు. వంతనపై కారులో పొగలు కక్కుతూ మంటలు వస్తుండటంతో ఇరువైపున వచ్చి పోయే వాహాదారులు ఏం ప్రమాదం సంభవిస్తొందోనని వాహానాలను నిలిపివేసుకోవడంతో వాహనాలు నిలిచిపోయి తీవ్ర అంతరాయం కలిగి, భారీగా ట్రాఫిక్ జామై వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫైర్ సిబ్బంది తక్షణమే స్పందించి కారులోని మంటలు ఆర్పడంతో ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగలేదు. మాదాపూర్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ ను నియంత్రించే పనిలో పడ్డారు.

