- తవ్వారు.. పైపులు వేయడం మరిచారు.
- స్పందించిన అదనపు కలెక్టర్ తవ్విన పైప్ లైన్ పూడ్చివేసిన కార్పొరేషన్.
ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: తవ్వారు.. పైపులు వేయడం మరిచారు అనే శీర్షికన జూన్ 1న ముద్ర దినపత్రికలో వచ్చిన వార్త రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ అదనపు కలెక్టర్ స్పందించారు శుక్రవారం కార్పొరేషన్ జెసిబి తో మార్కండేయ కాలనీ శివాలయం రోడ్డులో మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం తవ్విన కాలువ లో పైపులు వేయడం మరిచి ఆలస్యం చేయడంతో ముద్ర లో వచ్చిన వార్త కు వెంటనే స్పందించిన అదనపు కలెక్టర్ కాలనీవాసుల, వాహనాల రాకపోకలకు ఇబ్బందులను తొలగించేందుకు పైప్ లైన్ కోసం తవ్విన తవ్వకాల లో పైపులు వేయించి మట్టిని కూడిపించారు. పైప్ లైన్ పై మట్టిని పూడ్చడంతో సమస్య పరిష్కారం అయ్యింది.ముద్ర వార్తకు స్పందన రావడంతో సమస్య పరిష్కారం కావడంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు.
