ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో PACS ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ కూచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు మద్దతుగా ప్రభుత్వం చేపడుతున్న కొనుగోలు చర్యలు వారికి ఆర్థికంగా ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. రైతులు తమ పంటను నేరుగా కేంద్రానికి తీసుకువచ్చి అమ్ముకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి రైతులు, సంఘ ప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ శ్రీనివాసులు, మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ యాదయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.