Take a fresh look at your lifestyle.

పరిశుభ్రత పాటించకుంటే కఠిన చర్యలు

  • పుర కమిషనర్ మహమ్మద్ షేక్.

ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి : హోటల్లో బేకరీలు చిరుతిండ్ల వ్యాపారులు పరిశుభ్రతను పాటించాలని, అపరిశుభ్ర వాతావరణంలో వ్యాపారాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పుర కమిషనర్ మహమూద్ షేక్ అన్నారు. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలోని హోటల్లు, బేకరీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదులను, సామాగ్రి నిల్వ ఉంచే గదిని, అందులోని వస్తువులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న హోటల్స్ నిర్వాహకులకు సుమారు రూ, 80 వేల జరిమానా విధించారు. ప్రతి ఒక్కరు అనుమతులు తీసుకొని నిబంధన ప్రకారం వ్యాపారాలు చేసుకోవాలని లేనియెడల చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.తనిఖీల్లో పర్యావరణ ఇంజనీర్ శివ, ఆర్ ఐ చంద్రయ్య పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.