ముద్ర కూకట్‌పల్లి:
మహిళల రక్షణ మరియు రహదారి భద్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో కూకట్‌పల్లి ఐడిఎల్ చెరువు వద్ద శనివారం ఉదయం భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. శ్రీమతి నిషా ఆధ్వర్యంలో, సైబరాబాద్ పోలీసుల సహకారంతో ఈ కార్యక్రమం ఉదయం 6:30 గంటలకు ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి కూకట్‌పల్లి జోన్ డీసీపీ రీతూ రాజ్, IPS ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతదేశపు మొట్టమొదటి పారా సైక్లిస్ట్ కుమారి తాన్యా దగా ప్రత్యేక వక్తగా పాల్గొని అందరిలోనూ స్ఫూర్తిని నింపారు.
డీసీపీ మాట్లాడుతూ, సమాజంలో మహిళల భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ఇందులో ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఉండాలని పిలుపునిచ్చారు.
ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి.
మద్యం సేవించి వాహనాలు నడపరాదు ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి.
తాన్యా దగా తన ప్రయాణాన్ని వివరిస్తూ, మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, రహదారులపై ప్రయాణించేటప్పుడు భద్రతా అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు.
ఐడిఎల్ లేక్ వద్ద ప్రారంభమైన ఈ అవేర్‌నెస్ రైడ్ టి-హబ్ వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర కొనసాగింది. ఈ ర్యాలీలో మహిళా సైక్లిస్టులు, యువత మరియు స్థానిక నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘సురక్షిత ప్రయాణం – సురక్షిత సమాజం’ అనే సందేశాన్ని చాటారు.
కమ్యూనిటీ ఇంటరాక్షన్
రైడ్ అనంతరం టి-హబ్ వద్ద ఏర్పాటు చేసిన ‘కాఫీ మీట్’లో పాల్గొన్న వారు పోలీసులతో ముఖాముఖి చర్చించారు. ప్రజలు మరియు పోలీసుల మధ్య సమన్వయం పెంచడం ద్వారా మహిళా భద్రతను ఎలా మెరుగుపరచవచ్చో చర్చించారు. మహిళల రక్షణ కోసం నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని సైబరాబాద్ పోలీసులు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.