(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రతినిధి):
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ కలెక్టరేట్ ఆఫీస్ కాంప్లెక్స్ లో మెగా మహిళ ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా ఇంచార్జ్ మంత్రి డి.శ్రీధర్ బాబు ప్రారంభించారు. వైద్య శిబిరంలో గైనకాలజీ,జనరల్ మెడిసిన్ , ఆర్థోపెడిక్ డెర్మటాలజీ , ఆప్తాల్మాలజీ ఇఎన్టి మరియు డెంటల్ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సలు అందించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్యం మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే లలితా దేవి గారు పర్యవేక్షించారు కలెక్టరేట్ కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు శిబిరంలో పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా మమోగ్రామ్ అల్ట్రాసౌండ్ మరియు పాప్ స్మియర్ పరీక్షలను కూడా నిర్వహించారు.ఈ ఆరోగ్య శిబిరం ద్వారా వివిధ విభాగాల లో జనరల్ మెడిసిన్ 216మంది ,ఈ న్ టి 112, గైనకాలజీ 123 , ఆప్తమాలజీ 124, డెంటల్ 113 , ఆర్థోపెడిక్ 103, డెర్మటాలజి 111 ,మహిళా ఉద్యోగులు తమ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని అవసరమైన వైద్యసేవలు పొందారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారులు వైద్య సిబ్బంది మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.